Thursday, April 14, 2016

మన పంచాంగం గురుంచి తెలుసుకుందాం..

తెలుగు సంవత్సరాల పేర్లు:1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి,6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ,10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాథి, 14.విక్రయ, 15.వృక్ష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత్, 22.సర్వధారి,23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ,28.జయ, 29.మన్మథ, 30.దుర్ముఖి, 31.హేవలంభి,32.విలంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత్, 37.శోభకృత్, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ,45.విరోధికృత్, 46.పరీధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్త, 53.సిద్ధార్థి,54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుబి, 57.రుధిరోద్గారి,58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ప్రతి సంవత్సరాన్ని రెండు అయనాలుగా విభజించారు.. అవి 1. ఉత్తరాయనం, 2.దక్షిణాయనం. ఉత్తరాయణము: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో
ప్రవేశించే వరకు గల కాలము. ఇందులో మొదటి 6నెలలు ఉంటాయి.

దక్షిణాయణం: కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో
ప్రవేశించు వరకు గల కాలము. ఇందులో తర్వాతి 6 నెలలు ఉంటాయి.

ఆరు ఋతువులు: సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. అవి... వసంతం, గ్రీష్మం, వర్ష,శరదృతువు, హేమంత, శిశిరం. (రెండు మాసాలు కలిసి ఒక ఋతువు)
12 మాసములు: తెలుగు కాలమానంలో 12 నెలలు ఉన్నాయి. అవి.. 1.చైత్రం, 2.వైశాఖం, 3.జ్యేష్టం,4.ఆషాడం, 5.శ్రావణ, 6.భాద్రపదం, 7.ఆశ్వయుజం,8.కార్తీకం, 9.మార్గశిరం, 10.పుష్యం, 11.మాఘం,12ఫాల్గుణం

కాలాలు: వేసవి కాలం, వర్షా కాలం, చలి కాలం.. 12 నెలలు నాలుగు చొప్పున ఈ మూడు కాలాలకు ఉంటాయి.

పక్షములు: ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణ పక్షం, శుక్ల పక్షం. ఒక్కో పక్షంలో 15 తిథులు (రోజులు) ఉంటాయి. ఇవి పౌర్ణమి, అమావాస్యల మధ్య ఉంటాయి.

తిథులు: 1.పాడ్యమి, 2.విదియ, 3.తదియ,4.చవితి, 5.పంచమి, 6.షష్టి, 7.సప్తమి, 8.అష్టమి,9.నవమి, 10.దశమి, 11.ఏకాదశి, 12.ద్వాదశి,13.త్రయోదశి, 14.చతుర్ధశి, 15.పౌర్ణమి-అమావాస్య

వారాలు: ఒక పక్షానికి రెండు వారాలు. ఒక వారానికి ఏడు రోజులు... అవి 1.ఆది, 2.సోమ, 3.మంగళ, 4.బుధ, 5.గురు, 6.శుక్ర, 7.శని.
ఝాములు:ఒక రోజుకు ఎనిమిది ఝాములు ఉంటాయి. ఒక ఝాము అంటే మూడు గంటలు. ఒక గంటకు 60 నిమిషాలు.

27 కార్తెలు:వీటినే నక్షత్రాలు అంటాం. అవి.. 1.అశ్విని, 2.భరణి, 3. కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6. అర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనూరాధ, 18.జ్యేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ట, 24.శతభిష, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి..

12 రాశులు:1.మేషం, 2.వృషభం, 3.మిథునం, 4.కర్కాటకం, 5.సింహం, 6.కన్య, 7.తుల, 8.వృశ్చికం, 9.ధనుస్సు, 10.మకరం, 11. కుంభం, 12.మీనం.

9 గ్రహణాలు: 1,సూర్యుడు, 2.చంద్రుడు, 3.అంగారకుడు(కుజుడు), 4.బుధుడు, 5.బృహస్పతి(గురు), 6.శుక్రుడు, 7.శని, 8.రాహువు, 9.కేతువు

27 యోగాలు:1.విష్కంభ,2.ప్రీతి,3.ఆయుష్మ,4.సౌభాగ్య,5.శోభన,6.అతిగండ, 7.సుకర్మ, 8.ధృతి, 9.శూల, 10.గండ, 11.వృద్ధి, 12.ధ్రువ, 13.వ్యాఘాత, 14.హర్ష, 15.వజ్ర, 16.సిద్ధి, 17.వ్యతీపాత, 18.వరీయో, 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఐంద్ర, 27.వైధృతి

11 కరణాలు:1.బవ, 2.చాలవ. 3.కౌలవ, 4.తైతుల, 5.గరజ, 6.వనజి, 7.భద్ర, 8.శకుని, 9.చతుష్పాతు, 10. నాగవం, 11.కింస్తుఘ్నం

1 comment:

  1. YouTube Search For: YouTube Search - Videoodl.cc
    YouTube Search - YouTube Search for: YouTube Search. YouTube Search. YouTube Search. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeSearch. youtubeView 374 youtube mp3 more rows

    ReplyDelete