Thursday, April 14, 2016

అష్టదిక్పాలకులు - వారి ప్రాధాన్యత


ప్రతి ఇంటికి ఎనిమిది దిక్కులు ఉంటాయి. ఒక్కో దిగ్గుక్కును ఒక్కో దేవత పరిపాలిస్తుంటారు. ఆ ప్రకారం

1. తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈయన సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడు కనుక ఈ భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. ఈ దిక్కులో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

2. పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి. పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

3. ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.

4. దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

5. ఈశాన్య దిక్కకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

6. ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.

7. వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.

8. నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

No comments:

Post a Comment